ఉద్యోగాల ప్రకటన చరి్రత్రాత్మకం..నాడు అవిశ్రాంత పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ వేదికగా భారీ మొత్తంలో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం దేశంలోనే చరిత్రాత్మక విషయం. నీళ్లు, నిధులు, నియామకాలు వంటి అంశాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అంచలంచెలుగా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయంగా మారింది. బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులు రాష్ర్టాన్ని ప్రపంచం నలుమూలలా కీర్తించేలా తయారు చేస్తారనడంలో సందేహం లేదు.
– హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ బొల్లారం మండలాధ్యక్షుడు
సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయం. తెలంగాణ అనతికాలంలోనే సాధించిన అభివృద్ధితో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బుధవారం చేసిన ప్రకటన పట్టభద్రులైన నిరుద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపచేసింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికతకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో ప్రశంసనీయమైంది. ఇప్పుడు యావత్ రాష్ట్రంలోని నిరుద్యోగులు సీఎం కేసీఆర్‌ను దైవంగా భావిస్తున్నారు.
– హెచ్ఎం మంగీలాల్, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బొల్లారం