సిద్దిపేట, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 499 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లోని 114 మున్సిపల్ వార్డుల్లో షెడ్యూల్ ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రభు త్వ గ్యారెంటీలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ ని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఎంపీడీవో, తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల వారీగా కార్యక్రమ షెడ్యూల్ను ప్రదర్శించామని తెలిపారు. ప్రతి మండలంలో ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించేందుకు 2 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎం పీడీవో నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయ సూ పరింటెండెంట్, ఏపీవో, ఏపీఎం, ఏఈ ఎలక్ట్రిసిటీ, ఎంఏవో తదితరులతో ఒక బృందం, తహసీల్దార్ నేతృత్వంలో మండల పంచాయతీ అధికా రి, సర్వేయర్, స్టాటిస్టికల్ అధికారి, ఎంఈవో, మె డికల్ ఆఫీసర్ తదితరులతో మరో బృందాన్ని ఏ ర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 2 గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తుల ను స్వీకరిస్తామన్నారు.
కుటుంబానికి ఒక దరఖా స్తు చొప్పున అన్ని దరఖాస్తులను గ్రామపంచాయతీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డును జతపర్చాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున, మహిళలకు ప్రత్యేకంగా, ఇతర దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తు స్వీకరణ అనంతరం దరఖాస్తుదారులకు రసీదులను ఇస్తామని తెలిపారు. ప్రజాపాలన ప్రత్యేక కార్యక్ర మం నిర్వహణ రోజు దరఖాస్తు చేసుకోనివారు జనవరి 6వ తేదీ వరకు గ్రామపంచాయతీలో పం చాయతీ సెక్రెటరీకి దరఖాస్తులను అందజేయవచ్చన్నారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి, ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి హుస్నాబాద్ ఆర్డీవో బెనిషాలెం, సిద్దిపేట నియోజకవర్గానికి సిద్దిపేట ఆర్డీవో రమేశ్ బాబు, గజ్వేల్ నియోజకవర్గానికి గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్, దు బ్బాక నియోజకవర్గానికి డీఆర్డీవో పీడీ జయదేవ్ ఆర్య, జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీరామ్రెడ్డిని ని యమించామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.