నర్సాపూర్, మార్చి 1: ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నది. శనివారం నాటికి రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి డంపింగ్‌యార్డు ఏర్పాటును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డంపింగ్‌యార్డు ఏర్పాటైతే ఈ ప్రాంతం అన్నివిధాలుగా నష్టపోతుందని తెలిపారు. ప్రభుత్వం మొండిపట్టు వీడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలో జేఏసీ నాయకులు రమణారావు, రాజేందర్, భిక్షపతి, సురేశ్, రమేశ్‌యాదవ్, రామచందర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల, మార్చి 1: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదిల మండలం ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపుయార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ శనివారం రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. గుమ్మడిదల మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో 19వ రోజు రిలే నిరాహార దీక్షలో వడ్డెర సంఘం సభ్యులు, నల్లవల్లి 25వ రోజు రిలే నిరాహార దీక్షలో కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. వీరికి జేఏసీ నాయకులు పూలదండలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్ష నిరంతరం సాగేందుకు వడ్డెర సంఘం, నవజ్యోతి యువజన సంఘం సభ్యులు రూ.5వేల చొప్పున రూ.10 వేలు జేఏసీకి విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మూడు చింతల నరేందర్‌రెడ్డి, పుట్ట నర్సింగ్‌రావు, మాజీజడ్పీటీసీ కుమార్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు.తమ ప్రాంతానికి ఇబ్బందికరంగా మారే డంపుయార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. దీక్షల్లో వడ్డెర సంఘం సభ్యులు ఎల్లయ్య, అశోక్, పాండు, కృష్ణ, సురేశ్, నాగేశ్, నర్సింలు, వెంకటేశ్, యాదమ్మ, లక్ష్మి, జేఏసీ నాయకులు చిమ్ముల నర్సింహారెడ్డి, గోపాల్, ఆంజనేయులు, చంద్రారెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గటాటి రమేశ్, తుడుం శ్రీనివాస్, ఆకుల సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, కరుణాకర్, కావలి శంకర్‌యాదవ్, రాంరెడ్డి, సంజీవరెడ్డి, సంతోష్‌రెడ్డి, భిక్షపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.