జహీరాబాద్, జనవరి 22: రాజుల కాలంలో మల్లయోధుల పోటీలు నిర్వహించి వారి ప్రతిభ ఆధారంగా బహుమతులు ఇచ్చేవారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. ఆదివా రం జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో అంత ర్ రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహారాష్ర్ట, కర్ణాటక, తెలంగాణల్లోని పలు ప్రాంతాలకు చెందిన వారు పాల్గొని, తమ ప్రతిభ కనబర్చారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.
కుస్తీ పోటీల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పట్టణ సీఐ తోట భూపతి, పట్టణ ఎస్సై శ్రీకాంత్, ఎస్సై-2 రఫిక్ భారీ బందోబస్తు నిర్వహించారు. పోటీలో మహారాష్ర్టకు చెందిన ప్రశాంత్ మొదటి బహుమతి గెలుపొంది నగదు, కప్‌ను కైవసం చేసుకున్నారు. రెండో బహుమతి కర్ణాటకకు చెందిన మాణిక్ అందుకున్నారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీదు, బీఆర్ఎస్ నాయకుడు తన్వీర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మొయినొద్దీన్, నాయకులు ఖిజార్ యాఫై, నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.