రామచంద్రాపురం, ఆగస్టు 11: రాయసముద్రం చెరువు కట్టపై చేపడుతున్న సీసీ రోడ్డు పనులను అడ్డుకోకుండా సహకరించాలని భెల్ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి కోరారు. శుక్రవారం రాయసముద్రం చెరువు కట్టపై నిలిచిన సీసీ రోడ్డు పనులను వారు పరిశీలించారు. భెల్ ఉన్నతాధికారులతో మాట్లాడి సీసీ రోడ్డు పనులను అడ్డుకోవద్దని ప్రజల అవసరాల కోసం ఈ రోడ్డు వేయిస్తున్నామని వివరించారు.
దీనికి భెల్ అధికారులు సానుకూలంగా స్పందించడంతో సోమవారం నుంచి సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వారితో మాజీ కార్పొరేటర్ అంజయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, చంద్రశేఖర్‌గుప్తా, యాదగిరి, జగన్నాథ్‌రెడ్డి, మల్లారెడ్డి, రాజిరెడ్డి, నర్సింగ్, పెద్దరాజు, రాములు యాదవ్, సంతోశ్ రెడ్డి, విఠల్‌రెడ్డి, రమేశ్, అధికారులు ఉన్నారు.