నిజాంపేట, జనవరి 14 : విత్తనాలను భూమిలో వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుకు ఇతర జీవుల నుంచి ప్రతిరోజు పోరాటమే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేయూతనిస్తుండడంతో రైతులు భూమికి బరువయ్యేలా పంటలు పండిస్తున్నారు. చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ పంట చేనుల్లో కొత్త పరికరాలను ఏర్పాటు చేసుకొని పక్షులు, జంతువులు అటువైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజాంపేటకు చెం దిన రైతు రాజయ్య తన భూమిలో వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగుచేస్తున్నాడు. ఉదయం, సాయం త్రం సమయంలో పక్షులు, కోతులు, ఇతర జీవులు పంట చేనులపై పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.పంటలను కాపాడుకోవాలనే లక్ష్యంతో రాజయ్య స్థానికంగా ఉన్న ఓ దుకాణంలో ఛార్జింగ్ మైక్‌ను కొనుగోలు చేసి,అందులో పక్షులు,ఇతర జీవులు బయపడే శబ్ధ్దాలను రికార్డు చేసి మైక్‌ను పంట చేనుల మధ్యలో చెట్టుకు అమర్చాడు. మైక్ నుంచి వస్తున్న శబ్ధ్దాలకు నిజంగానే పంట చేనులో ఎవరో ఉన్నారని అనుకుని పక్షులు, కోతులు, అడవి పందులు అటు వైపుగా రావడం లేదు.
చార్జింగ్ మైక్‌తో పక్షులు అస్త్తలేవు..
నా పొలంలో 2ఎకరాల్లో మొక్కజొన్న, ఎకరంలో పల్లికాయ పంట లు పండిస్తున్నా. పగలంతా నేను డప్పు చప్పులతో పిట్టలు, కోతులను తరిమికొడుతా. రాత్రి అడవి పందులు మొక్కజొన్న, పల్లికాయ పంటలను నాశనం చేస్తున్నాయి. వీటిని తరిమికొట్టేందుకు రూ.900తో ఛార్జింగ్ మైక్‌ను కొన్న. అందులో ఊష్…. ఛూ… అరె..అరె…. అంటూ శబ్ధ్దాలను రికార్డు చేసి చేను మధ్యలో ఓ చెట్టుకు పెట్టిన. ఇగ అంతే రాత్రంగా మైక్ నుంచి వచ్చే చప్పుడుకు పంట చేను దిక్కు పక్షులు, అడవి పందులు రావట్లేదు.
– రాజయ్య, రైతు, నిజాంపేట
విద్యుత్ వైర్లను ఏర్పాటు చేసుకోవద్దు..
వ్యవసాయ భూముల్లో వివిధ రకా ల పంటలను సాగుచేస్తున్న రైతులు పంటలను పక్షులు, ఇతర జీవుల నుంచి రక్షించుకునే క్రమంలో పొలం చుట్టూ విద్యుత్ వైర్లను ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు. దీనివల్ల రైతుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. పక్షులు,ఇతర జీవులు భయపడే విధంగా ఉండే పరికరాలు,విభిన్నంగా శబ్ధాలు వచ్చే చార్జింగ్ మైక్‌ల వంటివి పంటల రక్షణకు వినియోగించాలి. వీటితో ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. రైతులు ఈ పద్ధతిని వినియోగించుకోవాలి.
– సతీశ్,మండల వ్యవసాయ అధికారి, నిజాంపేట
సిరుల పంటలు పండాలి
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు సం క్రాంతి శుభాకాంక్షలు. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలి. ప్రతిఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలి. ఈ సంక్రాంతి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి చెందింది. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. రైతుల ఇంట నిత్యం కొత్త కాంతులు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. సంక్రాంతి పండుగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
– హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
సంక్రాంతి శుభాకాంక్షలు
మెదక్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక భోగి మంటలు, రంగవల్లులు అన్నారు. పండుగ తెచ్చే సంబురాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
– పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
సంక్రాంతి పర్వదినం సందర్భంగా మెదక్ ప్రజలకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి చెందిందన్నారు. ప్రజలు కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవాలన్నారు. ఈ సంక్రాంతి ప్రతిఒకరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్నారులు పతంగులు ఎగురవేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
– శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ
జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో సంక్రాంతి శుభాకాంక్షాలు తెలిపారు. సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. సంక్రాంతి ప్రతిఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. రైతుల ఇంట నిత్యం కొత్త కాంతులు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లాలని భగవంతుడిని కోరుకున్నారు
– హేమలతా శేఖర్‌గౌడ్, మెదక్ జడ్పీ చైర్పర్సన్