అసలే వేసవి కాలం.. ఉష్ణోగ్రత రోజురోజుకు తీవ్రమవుతున్నది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఎండ ప్రతాపం తెలియని చిన్నారులు ఆటల్లో మునిగి తేలేందుకు ఉత్సాహం చూపుతారు. భానుడి భగభగకు ఏమాత్రం వెరవక ఎండలో ఆటలాడి అనారోగ్యం పాలవుతారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వండి
దుస్తుల విషయంలో జాగ్రత్త
పౌష్టికాహారం ఆరోగ్యానికి మంచిది
మారాం చేస్తే
ఆటలకు అలవాటు పడి ఆహారం విషయంలో కొంతమంది పిల్లలు మారాం చేస్తుంటారు. తల్లిదండ్రులు విసుగు చెందకుండా ఓపికగా వారికి నచ్చజెప్పాలి. బలవంతం చేయడం వల్ల పిల్లల్లో తల్లిదండ్రులపై ప్రతికూల వాతావరణం ఏర్పడి భవిష్యత్‌పై ప్రభావం పడుతుంది. సందర్భాన్ని పిల్లలకు వివరించి వారి స్తోమత మేరకు ప్రోత్సహించేలా తల్లిదండ్రులు ప్రణాళికలు రూపొందించు కోవాలి.
వేసవిలో వ్యాధులతో అప్రమత్తం
మిలియేరియా, పెరిఫోరైటిస్ ఇది హాస్టల్ విద్యార్థుల్లో ఎక్కువగా వస్తుంది. పాలిట్ మేఫిక్లైట్ ఎట్రిస్ ఫొటో టాక్సిక్ రియాక్షన్, ఫొటో అలర్జిక్ రియాక్షన్, ఆర్టికేరియం, మెలూప్మా వంటి వ్యాధులు వేసవిలో పిల్లలకు అధికంగా ప్రబలుతాయి. తొలుత చెమట పట్టిన తర్వాత దురద వస్తుంది. తర్వాత వారి శరీరాన్ని బట్టి వ్యాధులు పెరుగుతుంటాయి. ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
వ్యాపకాలు పెంచాలి
ఎండ సమయంలో పిల్లలను విశ్రాంతి తీసుకునే విధంగా చూడాలి. వారి ఆసక్తి మేరకు ఆటపాటల్లో ప్రోత్సహించాలి. క్రికెట్, టెన్నిస్, హాకీ లాంటి అవుట్డోర్ గేమ్స్‌ను ఉదయం, సాయంత్రం వేళల్లో ఆడుకోనివ్వాలి. స్టాంప్ కలెక్షన్స్, నృత్యం, సంగీతం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి.