జహీరాబాద్/సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 2: సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోహీర్లో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జహీరాబాద్ మండలం ఆల్గోలో 9.1, మల్చెల్మాలో 9.3, న్యాల్కల్లో 9.5, సత్వార్, మొగుడంపల్లిలో 10.2, ఝరాసంగంలో10.5, జహీరాబాద్లో 10.8, కోహీర్లోని దిబ్బలో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
చలి తీవ్రత తోపాటు పొగమంచు దట్టంగా కురుస్తుండంతో ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రతిఒ క్కరూ జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. గురువారం ఉదయం 9గంటల వరకు సం గారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై పొగమం చు దట్టంగా కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. వాహనానికి ముందు 10మీటర్ల దూరంలో కూడా ఏముందో కనిపించని పరిస్థితి ఏర్పడింది.