మెదక్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో పండిన సన్నరకం ధాన్యా న్ని గుర్తించేందుకు అధికారులు కొత్త నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కొనుగో లు కేంద్రాల్లో సన్నరకం, దొడ్డురకం ధాన్యా న్ని వేర్వేరుగా సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక పరికరం ద్వారా వడ్ల గింజను పొడువు, వెడల్పు కొలిచి, నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఆ ధాన్యాన్ని సన్నరకంగా పరిగణలోకి తీసుకోనున్నారు.
మెదక్ జిల్లాలో భూములను బట్టి ధాన్యం దిగుబడిలో తేడాలు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం సూచించిన రకాలను సాగుచేసినా కొనుగోలుకు మళ్ల్లీ నిబంధనలు పెట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. జిల్లాలో రైతులు ఏటా అత్యధికంగా వరి సాగుచేస్తారు. ఆ తర్వాత పత్తి పంట పండిస్తారు. ఈ సీజన్లో జిల్లాలో 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
ఇందులో సన్నరకం 2,30,964 మెట్రిక్ ట న్నులు, దొడ్డు రకం 5,19,000 మెట్రిక్ ట న్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో కొనుగోలు కేం ద్రాలకు సన్నరకం 1.20 లక్షల మెట్రిక్ ట న్నులు, దొడ్డు రకం 2.80 లక్షల మెట్రిక్ ట న్నులు మొత్తం కలిపి 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం 484 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సన్నాల సేకరణకు 93 కేంద్రాలు, దొడ్డు రకం వడ్ల కొనుగోలుకు 390 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో వరి కోతలు జోరందుకున్నా యి. ఇప్పటికే పలుచోట్ల పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని గుర్తించేందుకు వీలుగా కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం 33 రకాలను సన్నాలుగా గుర్తించినా.. బియ్యపు గింజ పొడవు 5 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మి.మీ, పొడవు వెడల్పుల నిష్పత్తి 2.5 మి.మీగా ఉం డాలి. అలా ఉంటేనే సన్నరకం ధాన్యంగా గుర్తిస్తారు. లేదంటే దొడ్డు రకం ధాన్యంగా పరిగణించనున్నారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలోని కొన్ని గింజలు పొట్టు ఒలిచి కొలిచేలా డిజిటల్ డయామీటర్ వంటి పరికరాలు అందుబాటులో తెస్తున్నా రు. ఈ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే బోనస్ చెల్లించనున్నారు. ప్రభుత్వం మద్దతు, బోనస్ కలిపి క్వింటాల్‌కు సన్న వడ్లకు రూ.2800 వరకు ధర చెల్లించనున్నది. కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో కోతలు విధించడంతో పాటు తాజాగా ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.మార్కెట్లో సన్నాలకు డిమాండ్ ఉండడంతో గతేడాది తేమతో సంబంధం లేకుండా ప్రైవేట్‌లో వ్యాపారులు సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2300 నుంచి రూ.3200 వరకు ధర చెల్లించారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతులు బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు సన్నాలు అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.