రామాయంపేట, ఫిబ్రవరి 11 : మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి ఆలయంలో దేవతామూర్తుల ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగంపేట ఆశ్రమ పీఠాదిపతి మాధవానంద సరస్వతీ స్వామి శనివారం ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద సరస్వతీ స్వామికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పండితులతో కలిసి స్వాగం పలి కారు. మాధవానంద స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగానికి మంగళ హారతులు, పూలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ దైవ భక్తి ఉండాలని, ఆధ్యాత్మికత ఉన్నవారికే భగవంతుడు వరంఇస్తాడన్నారు. సమాజంలోని అన్ని దేవాలయాలు అభివృద్ధి లోకి రావాలన్నారు. ప్రతిరోజూ ఆలయాల్లో దూపదీప నైవేద్యాలను నిర్వహించాలని మాధవానందస్వామి అన్నారు.
ఐక్యంగా ఉంటే అన్నీ సాధ్యమే : ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి
గ్రామస్తులు ఐక్యంగా ఉంటే అన్నిపనులు సాధ్యమేనని, అందరూ ఐకమత్యంగా ఉండి ఆలయాలకు పూర్వ వైభవం తేవాలనిని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. కోనాపూర్ లో శివ పంచాయతన హనుమాన్ విగ్రహానికి మాధవానంద స్వామితో కలిసి గ్రామస్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో వేదపండితులు డాక్టర్ కులకర్ణి నరేశ్సిద్ధాంతి, ఏలూరి నాగవంశీకృష్ణ, గంటి రాజేశ్‌శర్మ, శశిభూషణ్శర్మ, రమేశ్‌బాబు శర్మ, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, సర్పంచ్ దోమ చంద్రకళ, ఉప సర్పంచ్ దీపక్‌రెడ్డి, భక్తులు సిద్దిరాంరెడ్డి, చంద్రారెడ్డి, అశోక్‌రెడ్డి, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కిషన్, ఇమ్మానియేల్, మాజీ సర్పంచ్ భీరయ్య పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 11 : జిల్లా కేంద్రంలోని పసుపులేరు ఒడ్డున ఉన్న రేణుకాంబ ఆలయం 29వ వార్షికోత్సవానికి ముస్తాబైంది. వార్షికోత్సవం సందర్భంగా ఆలయా న్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామ దేవతలు నల్ల పోచమ్మ, ముత్యలమ్మ, బోరంచమ్మ, గట్టమ్మకు ఆదివారం బోనాలు నిర్వహిస్తున్నారు. 14వ తేదీన రేణుకాంబ మాతకు బోనాలు సమర్పిస్తామని, 28న రేణుకాంబ కల్యాణం నిర్వ హిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్‌గౌడ్, గౌడ సంఘం పట్టణాధ్యక్షుడు గడ్డమీది కృష్ణాగౌడ్ తెలిపారు.
శ్రీశైలం తరలిన శివస్వాములు
చిలిపిచెడ్, ఫిబ్రవరి 11: మండల దీక్షలు పూర్తి చేసుకున్న శివ స్వాములు శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి తరలివెళ్లారు. చండూర్ గ్రామంలోని రామలింగేశ్వర దేవాలయం నుంచి శివస్వాములు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి గురుస్వామి పూజలు చేశారు.
నేడు గ్రామ దేవతలకు బోనాలు
తూప్రాన్, ఫిబ్రవరి 11 : మున్సిపాలిటీలోని గీతారెడ్డి కాలనీలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్స వా లు ఘనంగా కొనసాగుతున్నాయి. పోతరాజ్పల్లిలో గౌడ సం ఘం ఆధ్వర్యంలో 8వ తేదీన మొదలైన ఉత్సవాలు 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అర్చకులు మడూరి దత్తుశర్మ, వినయ్‌శర్మ ఆధ్వర్యంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆదివారం గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఘనంగా లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం…
చేగుంట, ఫిబ్రవరి 11 : మండలంలోని కొండాపూర్(బీ) ్రగ్రామంలోని సింగరాయుని గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షికోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శనివారం స్వామివారి రథోత్సవాన్ని శోభాయత్రగా నిర్వహించారు. ఉత్సవాలకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి, సర్పంచ్ బాల్‌నర్సింహులు, ఎంపీటీసీ నవీన్, ఉప సర్పంచ్ రమేశ్, స్థానిక నాయకుడు బురుగు శ్రీనివాస్ హాజరయ్యారు.
దుర్గామాత ఆలయ వార్షికోత్సవాలు
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 11 : మండలంలోని జంగరాయి గ్రామంలో దుర్గామాత ఆలయం 9వ వార్షికోత్సవాల సందర్భంగా గణపతి పూజ, చండీహోమం నిర్వహించారు. ఎంపీపీ భాగ్యలక్ష్మి, సర్పంచ్ జ్యోతితోపాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
రామాయంపేటలోని పాండు చెరువు కట్టపై దత్తా త్రేయ, హనుమాన్, రామాలయాల్లో పూజలు నిర్వహించారు. హను మాన్ ఆలయంలో పూజారి శ్రీనివాస్‌చారి స్వామివారికి మంగళహారతులు, నైవేద్యాలను సమర్పించారు. రాయకంటి ఈశ్వర్‌కుమార్ భక్తులకు ప్రసాదాలు అందజేశారు.
– నేడు మెదక్‌లో నల్లపోచమ్మ బోనాలు