జహీరాబాద్, ఏప్రిల్ 30 : సీసీఎస్, జహీరాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి రూ.20 లక్షల విలువ గల 80 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చిరాగ్పల్లి ఎస్సై రాజేందర్‌రెడ్డి, సీసీఎస్ పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి మాడ్గి గ్రామ చౌరస్తాలోని 65 జాతీయ రహదారిలో బుధవారం వాహ న తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న టాటా ఇండిగో సీఎస్ కారును(ఏపీ28 డీఈ 3257) ఆపి తనిఖీ చేయగా, కారు డీక్కీలో గోధుమ రంగు కవర్ చుట్టిన 40 ఎండు గంజాయి ప్యాకెట్లు లభించాయి. గంజాయిని తరలిస్తున్న కారు డ్రైవర్ జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్‌కు చెందిన తిరుమలేశ్ను అదుపులోకి తీసుకొని గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గంజాయిని కర్ణాటకలోని బాగ్ధాల్లోని వినోద్‌కుమార్‌కు అప్పగించాలని కారుడ్రైవర్ సమీప బంధువైన బీదర్‌కు చెందిన గుండప్ప రూ.50వేల ఇస్తానని ఆశచూపడంతో ఒప్పుకుని తరలి స్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి అరెస్టుతోపాటు కారును సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లాలో గంజాయి సా గు, వినియోగం, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. గంజాయి సాగుచేసినా, తరలించిన 8712656777కు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. గంజాయిని పట్టుకున్న చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్‌రెడ్డి, సీసీఎస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.