Medak Church | మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 23 : మెదక్ చర్చి ఆదివారం నాడు క్రైస్తవ భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచిపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి చర్చి ప్రేసిబేటరీ ఇంచార్జి శాంతయ్య దైవ సందేశం చేశారు. పాస్టర్లు డేవిడ్, జైపాల్, శ్రీనివాస్‌లు భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భక్తులు యేసయ్యకు మొక్కులు తీర్చుకొని చర్చి ఆవరణలోని చెట్లకింద వంటావార్పు చేసుకున్నారు. ప్రార్థనల్లో భక్తులతో పాటు సీఎస్ఐ కమిటీ సభ్యులు గంట సంపత్, సువణ్ డగ్లస్, సంశాన్ సందీప్, నోబుల్సన్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
Medak Church1