పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 29: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంకరెడ్డి ప్రాంగణ నియామకాల్లో ప్రతిష్టాత్మక అమెజాన్ కంపెనీకి రూ.1.40 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) అచీవర్స్ డేను ఘనంగా నిర్వహించింది.
ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, సైన్స్, హ్యూ మానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులకు నియామక పత్రాలతోపాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశపత్రాలను అందజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 270కి పైగా దేశీయ, బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ గీతంలో ప్రాంగణ నియామకాలను నిర్వహించి, బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీ-ఫార్మసీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ విద్యార్థులను ఎంపిక చేశాయని, వచ్చే రెండు నెలల్లో మరో 40 సంస్థలు ప్రాంగణ నియామకాలు చేపట్టనున్నాయని గీతం వర్గాలు తెలిపాయి.
కొందరు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకొని దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశ అర్హత సాధించినట్టు తెలిపా రు. అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసిన పలువురు విద్యార్థులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ఉద్యోగులుగా తీసుకున్నట్టు తెలిపారు. తొలిసారి ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) ప్రాంగణ నియామకం చేపట్టి, ముగ్గురిని ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్లుగా ఎంపిక చేసిందని తెలిపారు.
అమెజాన్ సంస్థ రూ.1.40 కోట్ల గరిష్ఠ వార్షిక వేత నం, అట్లాసియన్ రూ.60లక్షల గరిష్ఠ వార్షిక వేత నం, మైక్రోసాఫ్ట్ రూ. 51లక్షలు, వర్చూసా ఇంటర్నేషనల్ రూ.47.9లక్షలు, సిలికాన్ ల్యా బ్స్ రూ. 30.6లక్షలు, ఫెడరల్ బ్యాంక్ రూ. 16.42లక్షలు, తా ట్ వర్క్స్, ఒరాకిల్, డెలాయిట్, హెచ్ఎస్ బీసీ, డెలివరూ మొదలైన సంస్థలు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలతో గీతం విద్యార్థులను ఎం పిక చేసుకున్నాయి. గీతం ఆచీవర్స్ డేలో అరబిం దో ఫార్మా అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్, ఇనోవాలోన్ హెచ్ఆర్ విభాగం డైరెక్టర్ అండ్ జీఎం కార్తీక్ ఎలమంచిలి గౌరవ అతిథులుగా పాల్గొని విద్య, ఉపాధి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సమయపాలన, క్రమశిక్షణ, ప్రతిభ, స్కిల్స్ ఎంచుకున్న రంగంలో రాణించేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు. కష్టపడే వారికి ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్‌రావు, స్కూ ల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి నియామకాల్లో ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ప్రొఫెసర్ శివకుమార్, డాక్టర్లు దివ్యకీర్తి గుప్తా, మోతాహార్ రెజా, బందన కుమార్ మిశ్రా, ప్రదీప్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర త్రినాథరావు పాల్గొన్నారు.