సంగారెడ్డి, డిసెంబర్ 12 రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడం లేదని, సీఎం రేవంత్ నాయకత్వం రైతుల ప్రాణాలు తీస్తున్న సర్కారు కొనసాగుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధ్వజమెత్తారు. గుండెనొప్పితో గురువారం సంగారెడ్డి ప్రభు త్వ దవాఖానలో చేరిన లగచర్ల రైతు హీర్యానాయక్‌ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించా రు. దవాఖానలో వైద్యులు హీర్యానాయక్‌కు వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేరుకుని బాధితుడిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దవాఖా న సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్‌తో ఎమ్మెల్యే మాట్లాడి హీర్యానాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. హీర్యానాయక్‌కు గుండె సమస్య ఉందని, మరిన్ని పరీక్షలు, మెరుగైన పరీక్షల కోసం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు తెలిపారు. వెంటనే తరలించి మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని డాక్ట ర్ అనిల్‌కుమార్‌కు సూచించారు.
అనంతరం దవాఖాన బయట మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. గండెనొప్పితో బాధపడుతున్న హీర్యానాయక్‌ను జైలు సిబ్బంది, పోలీసులు బేడీలతో దవాఖానకు తీసుకురావటం దారుణం అన్నారు. ఆడబిడ్డలపై ఆకృత్యాలు చేసే దుర్మార్గులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కానీ.. అమాయకులైన గిరిజన రైతులకు మాత్రం బేడీలు వేసి నేరస్తులు చిత్రీకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రక్తాన్ని స్వేదంగా మార్చి బువ్వపెట్టే గిరిజన రైతు హీర్యానాయక్‌కు రేవంత్ సర్కార్ బేడీలు వేసి దవాఖాన తీసుకురావటం హేయమైన చర్య అని, ఆయనకు ఏదైనా జరిగితే రేవంత్ సర్కార్‌దే బాధ్యత అని హెచ్చరించారు.
హీర్యానాయక్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. లగచర్ల రైతులు నెలరోజులకు పైగా కంది జైలులో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జైలులోని మరి కొంతమంది రైతులు అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ, రైతుల పోరాటంతో లగచర్లలో ఫార్మాసిటీపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ సర్కార్ రైతుల విషయం లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఫార్మాసిటీ రద్దు చేసిన నేపథ్యంలో లగచర్ల రైతులపై ఉన్న కేసులను ఎత్తివేసి రిమాండ్‌లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. హీర్యానాయక్‌ను పరామర్శించిన వారిలో జైపాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.