చేర్యాల, జూలై 14 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఆదివారం సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, సిబ్బంది, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు,ఒగ్గు పూజారులు, భక్తులకు సేవలందించారు. హైకోర్టు జడ్జి ఎన్వీ శ్రవణ్‌కుమార్ కుటుంబ సభ్యుల తో కలిసి స్వామివారిని దర్శించుకున్నా రు. దేవాదాయశాఖ ఏసీ శివరాజ్ ఆధ్వర్యంలో అర్చకులు జడ్జికి స్వామివారి జ్ఞాపిక, ఆశీస్సులు అందజేశారు.
కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీ పీ సతీశ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎస్సై రాజుగౌ డ్, ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ తన కుటుంబంతో కలిసి మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేస్తానని ఆయన అన్నారు. దేవాదాయశాఖ ఏసీ ఆధ్వర్యంలో అర్చకులు స్వామి వారి జ్ఞాపిక, తీర్థప్రసాదాలను ఎంపీకి అందజేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు లింగంపల్లి కనకరాజు, మాజీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, సార్ల లింగం, చంద్రం, శ్రీకాంత్, బాలయ్య, రమేశ్, చెరుకు రమణారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, విష్ణుమూర్తి, రాజు పాల్గొన్నారు.