Heavy Rain : మెదక్ పట్టణాన్ని వరుణుడు వదలడం లేదు. ఓ దఫా కుంభవృష్టితో జనజీవనాన్ని స్తంభించజేసిన వాన.. రాత్రి 9 గంటలకు మళ్లీ మొదలైంది. ఈసారి కూడా భారీగా చినుకులు పడుతున్నాయి. రోడ్లన్నపీ జలమయం అయ్యాయి. ఇప్పటికే పలు కాలనీల్లోకి మోకాళ్లలోతున నిలిచిన నీరు నిలిచింది. చమన్ (Chaman) నుంచి బాలాజీ మఠం(Balaji Matham) మార్గం వరకూ రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో, ఏమీ చేయాలో పాలుపోక జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి భారీ వర్షం పడుతున్నందున వరద నీరుతో తిప్పలు తప్పేలా లేవని అందోళన చెందుతున్నారు స్థానికులు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు (శుక్రవారం) మెదక్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు జిల్లా విద్యాధికారి సెలవు ప్రకటించారు.
🌧️ Heavy rains disrupt power in Medak! ⚡Severe damage to power infrastructure!
🔹 971 electric poles damaged
🔹 262 distribution transformers effctedTGSPDCL teams are working tirelessly to restore power on war footing. 💡#TGSPDCL #Medak #PowerRestoration #Floods… pic.twitter.com/NGNLqFN3AU
— TGSPDCL (@tgspdcl) August 28, 2025