చిలిపిచెడ్ : మండలంలో సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.
చిలిపిచెడ్ : మండలంలో సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి గౌతాపూర్ గ్రామంలో ఓ ఇంట్లోకి వర్షం నీరు చేరగా, జగ్గంపేట గ్రామంలో పెద్ద చెట్టు ఇంటిపై పడడంతో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అదేవిధంగా చిలిపిచెడ్ చెక్ డ్యాంపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. 129.5 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు మండల అధికారులు తెలిపారు.