నిజాంపేట, మే 4 : ‘వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె’ నినాదంలో చేపట్టిన హరతహారంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమ స్థాయిలో చేపడుతున్నారు. ప్రభుత్వం గ్రామా ల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, మొక్కల పెంప కాన్ని చేపట్టినది. ప్రతి మొక్క బతికేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో నర్సీరల్లో మొక్కలు ఎండిపోకుండా షెడ్నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. షెడ్నెట్ ఏర్పాటుతో ఎండ తీవ్రత ను తగ్గించి, మొక్కలు ఎండిపోకుండా కాపాడు తున్నారు. నిజాంపేట మండలంలో 14 గ్రామ పంచాయతీల్లో 14 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 13వేల చొప్పున 1.82 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఎప్పటికప్పుడూ నర్సరీలను జిల్లా, మండల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నర్సరీకి షెడ్నెట్ ఏర్పాటు చేసి, వేసవిలో మొక్కలను ఎండల నుంచి కాపాడుతున్నారు. ప్రస్తుతం నర్సరీల్లో 80వేల మొక్కలు హరితహారానికి సిద్ధంగా ఉన్నాయి.
నర్సరీల్లో పెంచుతున్న మొక్కల రకాలు నర్సరీలో నీడ నిచ్చే మొక్కలు తురాయి, కదంబ, చింత, కానుగ, గుల్మర్, పండ్ల మొక్కలు సీతఫలం, నిమ్మ, దానిమ్మ, జామ, పూల మొక్కలు గులాబీ, మల్లె మొక్కలు పెంచుతున్నా రు. వన సేవకులు నిత్యం నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు.
8వ విడత హరితహారానికి సిద్ధం
నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలపై దృష్టి సారిస్తున్నాం. చనిపోయిన మొ క్కల స్థానంలో కొత్త మొక్కల ఏర్పా టు చేయడం, రక్షణ చర్యలు తీసుకుంటున్నాము. మండలంలోని అన్ని గ్రామాల నర్సరీల్లో 8వ విడుత హరితహారానికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేస్తున్నాము. ప్రజల, ప్రజాప్రతినిధుల సహకారంతో నిర్దేశించిన లక్ష్యా న్ని చేరుకుంటాం.
– ఎంపీడీవో వెంకటలక్ష్మి
నర్సరీల్లో షెడ్నెట్లను ఏర్పాటు చేశాం
ఎండాకాలం కావడంతో మండలంలో ని 14 నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా షెడ్నెట్లను ఏర్పాటు చేశాం. ప్రతిరోజూ రెండుసార్లు వన సేవకులతో మొక్కలకు నీళ్లు పట్టేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు అవసరమున్న రకాలనే నర్సరీల్లో పెంచుతున్నాం. గతంలో నాటిన మొక్కలకు ట్రీగార్డులను ఏర్పా టు చేయడంతో ఇప్పుడు ఏపుగా పెరగడంతో గ్రామాల్లో ఏటు చూసిన పచ్చదనమే తాండవిస్తుంది.
– ఏపీవో శ్రీనివాస్