ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
పేదలకు కంటి పరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించాలని ఉద్దేశంతో సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఏర్పాటు చేసుకున్నామని, ఆరోగ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
- సంపూర్ణ ఆరోగ్యంతోనే నిజమైన అభివృద్ధి
- ఎల్వీ ప్రసాద్ దవాఖాన సేవలు వినియోగించుకోవాలి
- డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకోవాలి
- ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాలు ఇప్పించే బాధ్యత నాది
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, జూలై 11: పేదలకు కంటి పరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించాలని ఉద్దేశంతో సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఏర్పాటు చేసుకున్నామని, ఆరోగ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆటో ఎలక్ట్ట్రికల్ అసోసియేషన్ వారికి ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన సౌజన్యంతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్‌తో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వెళ్లే స్థోమత లేని ఎంతోమందికి సిద్దిపేటలోనే నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ దవాఖాన ఏర్పాటు చేసి, ఇప్పటికే ఎంతో మందికి చికిత్స, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. బైక్ మెకానిక్‌లు, బస్సు డ్రైవర్లు, ఎలక్ట్ట్రీషియన్లు వంటి వృత్తుల వారు దవాఖానను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 40 ఏండ్ల తర్వాత చాలామందికి కంటి సమస్యలు వస్తుంటాయని, చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి నిర్లక్ష్యం చేస్తుంటారని తెలిపారు.
ప్రతి ఒకరూ తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎవరికైనా కళ్లద్దాలు, ఆపరేషన్ అవసరమైతే చేయించే బాధ్యత తాను తీసుకుంటానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, రానున్న రోజుల్లో ఇక్కడి ప్రజలకు మరింత సేవ చేస్తానని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల సాయిరామ్, మెహన్‌లాల్, బాబుజానీ, ఆజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

