చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 2: వచ్చే ఏడాది మెదక్‌లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేటలోని శ్రీనివాసగార్డెన్‌లో లబ్ధిదారులను పింఛన్ మంజూరు పత్రాలను మంత్రి, ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది మెదక్‌లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే.. బీజేపీ నాయకులు ఉచితాలు వద్దంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలో సరైన వైద్యం అందలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నదన్నారు. అర్హులందరికీ ఆసరా పిం ఛన్లు అందిస్తున్నామన్నారు. పింఛన్లు రానివారు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నా రు. త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తామన్నా రు. దసరా తర్వాత సొంతిం టి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే రూ.3 లక్షలు అందిస్తామన్నా రు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇం టింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు ప్రవేశపెట్టామన్నా రు. గత ప్రభుత్వాలు రైతులు మరణిస్తే నయా పైసా కూడా ఆర్థిక సాయం అందించలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుబీమా పథకం ద్వారా రైతులు మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామన్నా రు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాధవి, రైతుబంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధి క, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో గణేశ్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.