రామచంద్రాపురం, మార్చి 8: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలోని శ్రీఅనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. 16,17 వార్డుల గ్రామ తాజామాజీ కౌన్సిలర్లు ఒగ్గు సుచరితకొమురయ్య దంపతులు, పట్లోళ్ల రవీందర్‌రెడ్డి దంపతులు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమార్, బీఆర్ఎస్ నేతలు ఆదర్శ్‌రెడ్డి, సోమిరెడ్డి, రాములుగౌడ్, అంజయ్య, బుచ్చిరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి మాజీ మంత్రి హరీశ్‌రావుకి హారతి ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించి స్వామివారి ఫొటోను అందజేశారు. హరీశ్‌రావుకి వెలిమెలలో బీఆర్ఎస్ శ్రేణులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.