సిద్దిపేట, అక్టోబర్ 17: సిద్దిపేట అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లు ఆటోవాలాలు అని మాజీమంత్రి హరీశ్‌రావు గొప్పగా చెబుతుంటారు. రెకాడితో కాని డొకాడని పరిస్థితి ఆటోవాలాలది. వారి శ్రేయస్సు కోరి అండగా నిలుస్తూ ఆటో కో ఆపరేట్ సొసైటీని హరీశ్‌రావు ఏర్పాటు చేశారు. ఈ సొసైటీకి గౌరవ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాల సాయిరాంను నియమించి వారికి అండగా నిలుస్తున్నారు. ఆర్థిక స్థోమత లేక అప్పులు తెచ్చుకొని మళ్లీ కట్టలేని పరిస్థితిలో ఆటోను కుదవపెట్టి సతమతం అవుతున్న ఆటోవాలాలకు అండగా ఉండాలని హరీశ్‌రావు నిర్ణయించి, తన సొంతింటి స్థలాన్ని బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టి కార్మికులకు బీమా చేయించారు.
వారికి ఆర్థికంగా అవసరం ఉప్పుప్పుడు డబ్బులు తీసుకొనే వెసులుబాటును కల్పించి కార్మికుల కుటుంబాలకు చేయూత నిస్తున్నారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు ఆటోవాలా మరణిస్తే రూ.4లక్షలు, సహజంగా మరణిస్తే బీమా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఇప్పటి వరకు ఆటో క్రెడిట్ సొసైటీ ద్వారా 15 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున రూ.30లక్షల చెకులు అందజేశారు. కుటుంబంలో పెద్ద దికును కోల్పోయిన ఆటోవాలా కుటుంబానికి పెద్దన్నగా హరీశ్‌రావు అండగా నిలుస్తున్నారు. సిద్దిపేట ఆటో కోఆపరేటీవ్ సొసైటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన ఆటోడ్రైవర్ అసర్ల నర్సింలు నంగునూరు వద్ద రోడ్డు మీద వడ్ల కుప్పకు ఢీకొని ఆటో బోల్తా పడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కుటుంబానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలిచారు. ఆటో క్రెడిట్ కోఆపరేటీవ్ సొసైటీ ద్వారా రూ.4లక్షల ఆర్థిక సాయం అందజేశారు. గతంలో రూ.2 లక్షలు చెక్కు ఇవ్వగా, ఇటీవల మరో రూ.2 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ధైర్యంగా ఉండాలని పిల్లల చదువు బాగోగులు చూసుకుంటానని భరోసానిచ్చారు.
నాభర్త అసర్ల నర్సింహులు చనిపోయాడు. రెకాడితో డొకాడని పరిస్థితి మా కుటుంబానిది. మాకోసం హరీశ్‌రావు చేసిన సహాయం ఎన్ని జన్మలు ఎత్తినా తీరనిది. ఆయన సాయాన్ని మరువలేం. మాకు దేవుడు లాంటి వారు. ఒక అన్నలా మాకు అండగా నిలిచిన హరీశ్ అన్నకు రుణపడి ఉంటాం. – అసర్ల జమున, సిద్దిపేట
నా భర్త అఫ్జల్ పాషా అనారోగ్యంతో చనిపోయారు. ఆయన ఆటో నడిపి డబ్బులు సంపాదిస్తేనే మాఇల్లు గడిచే పరిస్థితి. అనారోగ్యంతో ఉన్నప్పుడు హరీశ్‌రావు సార్ సాయం చేశాడు. మాకు ఆటో సొసైటీ ఏర్పాటు చేసి ఎంతో మేలు చేశాడు. నాభర్త చనిపోతే సొసైటీ ద్వారా 2లక్షలు రూపాయలు ఆర్థికంగా ప్రయోజనం చేశారు. హరీశ్‌రావు సాబ్‌కు ఎల్లప్పుడూ మా కుటుంబం రుణపడి ఉంటుంది. – షాహెదా, భరత్‌నగర్, సిద్దిపేట