చిన్నకోడూరు, మార్చి 23: కందులు, జొన్న లు, సన్‌ప్లవర్, మొక్కజొన్న, వరి తదితర రైతులు పండించిన పంటలన్నింటినీ కేం ద్రంతో సంబంధం లేకుండారాష్ట్రం పూర్తిస్థాయిలో రైతుల నుంచి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేం ద్రంలో పలు కార్యక్రమాల్లో అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మద్దతు ధరకు రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట ఉత్పత్తులు కొన్నట్లు గుర్తుచేశారు.
ఇవాళ కాంగ్రెస్ ప్రభు త్వం కందులు ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎకరాకు కందులు 9 క్వింటాళ్ల వరకు పండితే 6 క్వింటాళ్లు సర్కారు కొంటే మిగతావి రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 11 వేల ఎకరాలు సన్‌ప్లవర్ పంట సాగైందని, కానీ.. 500 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతుల నుంచి కొనడానికి ప్రభుత్వం ఆదేశించడం సరికాదన్నారు.
పండిన పంటంతా కొనడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఇంతవరకు మొకజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో రైతులు నష్టపోతున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జొన్నలు, కందులు రైతుల నుంచి పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ప్రభు త్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నట్లు హరీశ్‌రావు విమర్శించారు.
సన్ప్ల్లవర్ రైతుల సమస్యలను అసెంబ్లీలో తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, సన్‌ప్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో సన్ప్ల్లవర్ రైతులు ఇబ్బంది పడుతుంటే మం త్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో వేలేటి రాధాకృష్ణశర్మ, కాముని శ్రీనివాస్, పాపయ్య, ఇట్టబోయిన శ్రీనివాస్, ఉమేశ్‌చంద్ర, జంగిటి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, ఎల్లయ్య, వేణు, బాబు, రాజిరెడ్డి, లింగం, రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.