సిద్దిపేట, ఆగస్టు 8: ప్రజలందరికీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అకాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ఆయన పేర్కొన్నారు.
ఈ పర్వదినాన్ని ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్నాచెల్లెళ్లు, అకాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ జరుపుకొనే రాఖీ పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా నిర్వహించుకో
వాలని పేర్కొన్నారు.