గజ్వేల్, జూన్ 3: మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గజ్వేల్‌లోని కేసరి హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కేక్‌కట్ చేశారు. ప్రభుత్వ దవాఖానలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.
ఇందిరాపార్కు చౌరస్తాలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ జెజాల వెంకటేశంగౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జకియొద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, రాజిరెడ్డి, దయాకర్‌రెడ్డి, హైదర్‌పటేల్, అశోక్‌రావు, దేవేందర్, నర్సింగరావు, రమేష్‌గౌడ్, రాములు, మల్లేశంగౌడ్, నరేష్, కనకగౌడ్, మాజీ కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, దుర్గాప్రసాద్, చందు, కనకయ్య, అత్తేల్లి శ్రీనివాస్, రజిత, అరుణ, శివకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశం, శ్రీధర్, అహ్మద్, ఉమర్, స్వామిచారి పాల్గొన్నారు.
ఆదర్శ నేత హరీశ్‌రావు
తూప్రాన్, జూన్ 3 : రాజకీయాల్లో హరీశ్‌రావును ఆదర్శంగా తీసుకోవాలని, అనుక్షణం ప్రజాసేవలో ఆయన ఉంటారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవరణలో మంగళవారం హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలను తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మెన్ బొంది రాఘవేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏర్పుల లక్ష్మణ్, ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.