మెదక్ రూరల్ సెప్టెంబర్ 15 : దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించాలని మెదక్ పిఎస్ఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ మండల పరిధిలోని ర్యాల మడుగు, మంబోజిపలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం వరి ధాన్యానికి ఏ గ్రేడ్ ధర 2,389, బి గ్రేడ్ ధర 2,369 కేటాయించిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, తిరుపతి రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు