దుబ్బాక,ఆగస్టు 30 : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ చేనేత కుటుంబంలో విషాదం నెలకొంది. దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో నివసిస్తున్న చేనేత కార్మికుడు తుమ్మ రాజలింగం-సత్యవతి దంపతుల కుమారుడు తుమ్మ నవీన్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
తుమ్మ నవీన్ (29) సిద్దిపేటలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నవీన్‌కు సిద్దిపేటకు చెందిన ప్రజ్ఞా అనే యువతితో నాలుగేండ్ల కిందట వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో నవీన్ తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.