హుస్నాబాద్, సెప్టెంబర్ 30: చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే బం గారు భవిష్యత్తు ఉంటుందని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లాస్థా యి అండర్-17 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలు సోమవారం హుస్నాబాద్‌లోని మినీస్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. మూడు జిల్లాల స్థాయి హ్యాండ్‌బాల్ పోటీ లు హుస్నాబాద్‌లో నిర్వహించడం హర్షనీయమన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, దొడ్డి శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు వెన్న రాజు, మహేందర్‌రెడ్డి, కృష్ణ, హ్యాండ్‌బాల్ పోటీల ఇన్చార్జిలు రఫత్ ఉమర్, రాజశేఖర్, పీడీ సుజాత, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.