Dumping Yard | గుమ్మడిదల, మే 3: ప్యారానగర్ డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు 88వ రోజుకు చేరుకున్నాయి. శనివారం గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ నాయకులు, మహిళా సంఘాలు రిలే నిరాహారదీక్షలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్యారానగర్ సమీపంలో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు (ఎంఎస్‌డబ్ల్యూ)ను వెంటనే రద్దు చేసి ఇక్కడి గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో రైతు జేఏసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.