కొండపాక (కుకునూర్‌పల్లి) ఫిబ్రవరి 16: భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆదివారం భారత జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల ప్రశాంత్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర కన్వీనర్ దేవీ రవీందర్, బీఆర్ఎస్ ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కుకునూర్‌పల్లి, కొండపాక మండలాల నాయకులు, మహిళలు, యువకులు బోనాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. గులాబీ పూల వర్షం కురిపించి జై కేసీఆర్, జై కవితక్క అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాడుతుందని తెలిపారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో అబద్ధాలు, అసమర్ధ పాలన కొనసాగుతోందని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో కోల సద్గుణా రవీందర్, పెద్దంకుల శ్రీనివాస్‌గౌడ్, సింగారం రాములు, మంద ఐలయ్య, కోడెల రవి, సందీప్‌చారి, అమరేందర్, ఐలయ్య, కిరణ్, మహిపాల్, తదితరులు ఉన్నారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 16: సిద్దిపేటలో ఆదివారం శుభకార్యాల్లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల వద్ద ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి పూలు చల్లి కవితకు గ్రాండ్ వెలమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలకు, అకడికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం సిద్దిపేట పోలీసు కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితతో పలువురు మహిళలు, పట్టణవాసులు ఫొటోలు దిగారు.
ప్రజ్ఞాపూర్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం
గజ్వేల్, ఫిబ్రవరి 16: ఎమ్మెల్సీ కవితకు గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం ఘనస్వాగతం పలికారు. సిద్దిపేట వెళ్తున్న సందర్భంగా ప్రజ్ఞాఫూర్ వద్ద కవితను ఆపి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.