తొలివిడతకు ముగిసిన నామినేషన్ల ఘట్టం
మొదటి విడత నిర్వహించే గ్రామ పంచాయతీలకు మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మొ దటి రెండు రోజులు సర్పంచ్, వార్డుల సభ్యుల స్థానానికి అంతంతమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత అభ్యర్థులు క్యూలో వేచి ఉండి నామినేషన్లు వేశారు.
- మూడోరోజు తరలివచ్చిన అభ్యర్థులు
- చివరి రోజు అత్యధికంగా నామినేషన్లు దాఖలు
- నేటి సాయంత్రం వరకు నామినేషన్ల పరిశీలన
గజ్వేల్, నవంబర్ 29: మొదటి విడత నిర్వహించే గ్రామ పంచాయతీలకు మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. మొ దటి రెండు రోజులు సర్పంచ్, వార్డుల సభ్యుల స్థానానికి అంతంతమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత అభ్యర్థులు క్యూలో వేచి ఉండి నామినేషన్లు వేశారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, మర్కూక్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లోని 163 సర్పంచ్, 1432 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్న ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.
తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్‌ను వార్డు సభ్యులు ఎన్నికల అధికారుల సమక్షంలో ఎన్నుకుంటారు. నేడు నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు. డిసెంబర్ 3మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదేరోజు సాయంత్రం పోటీలో ఉండే సర్పం చ్, వార్డు సభ్యులకు గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. గుర్తుల కేటాయింపు తర్వాత గ్రామాల్లో డిసెంబర్ 4నుంచి 9వర కు అభ్యర్థుల ప్రచారం ఉపందుకోనుంది.
ఎన్నికల దృష్ట్యా నిఘా…
జిల్లావ్యాప్తంగా డబ్బు, మద్యం పట్టివేతకు నిఘా ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి రూ.50 వేల నగదు కంటే ఎక్కువ తీసుకెళ్లరాదని అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి రాజీవ్ రహదారి నుంచి బెజ్జంకి వరకు 94కిలోమీటర్ల వరకు పోలీస్ అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఐదు పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశా రు. రాజీవ్ రహదారి వంటిమామిడి, తోటపల్లి బెజ్జంకి క్రాస్‌రోడ్, భూంపల్లి ఎక్స్‌రోడ్డు, చేర్యాల పరిధిలోని ముస్తాల వద్ద, హుస్నాబాద్ జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. శుక్రవారం ములుగు మం డలం వంటిమామిడి చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేయగా, ప్రయాణికుడి వద్ద రూ.3 .20లక్షలు నగుదు లభించింది. ఎలాంటి ఆధారాలు చూపించక పోవడంతో డబ్బుల ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

