రాష్ట్రంలో చేపడుతున్న ధాన్యం సేకరణ పనులను దేశంలోనే అత్యున్నతంగా ఉందని, రాష్ట్ర ఆహార కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి అన్నారు. శనివారం తూప్రాన్, రామాయంపేట మండలాల్లో ఆహార కమిటీ సభ్యులతో కలిసి ఆయన పర్యటించి యావాపూర్ ఐకేపీ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని, ఘనపూర్‌లోని వీరభద్ర రైస్‌మిల్లును తూప్రాన్ పట్టణంలోని ఒకటవ నెంబర్ రేషన్ దుకాణాన్ని, రామాయంపేటలోని మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రైతులు వరి కి ప్రత్నామ్మాయంగా వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలని సూచించారు. కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. తూకంలో అవకతవకలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మనోహరాబాద్, మే 14: ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు మహర్దశ పట్టనున్నది. ఎన్నో ఏండ్ల కిందట నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేవిధంగా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో రెండు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా సమీకృత భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
ప్రజలకు తీపి కబురు..
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల ప్రజలకు సీఎం కేసీఆర్ మరో తీపికబురు వినిపించారు. డివిజన్ కేంద్రమైన తూప్రాన్‌లో, నూతనంగా ఏర్పాటైన మనోహరాబాద్ మండలాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలను నిర్మించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట అందరికీ అందుబాటులో ఉండేవిధంగా సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు తూప్రాన్ మండలానికి రూ.10 కోట్లు, మనోహరాబాద్ మండలానికి రూ.10 కోట్ల నిధులను మంజూరు చేశారు. తూప్రాన్‌లో ఇంతకుముందు ఉన్న పాత ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలను తొలగించి అదేచోట నూతన సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. మనోహరాబాద్ మండలంలో నూతన సమీకృత భవన నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలిన చేశారు. ప్రస్తుత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే దారిలో నూతన సమీకృత భవనాన్ని నిర్మించనున్నారు.
నేడు పనులను ప్రారంభించనున్న మంత్రి …
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో నూతనంగా నిర్మించబోయే సమీకృత భవన నిర్మాణ పనులను మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరు మండలాల్లో మంత్రి పనులను ప్రారంభించనున్నారు. జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్లు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్గౌడ్ అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ఇదివరకే మంజూరు చేసిన నిధులతో రెండు మండలాలు జిల్లాస్థాయిలో అభివృద్ధిలో ముందు వరసలో ఉన్నాయి. సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలతో ప్రజలు అటూ ఇటూ తిరిగే పరిస్థితి లేకుండా ఒకేచోట అధికారులతో పనులు జరిపించుకోవచ్చు.
– ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, మెదక్ జడ్పీ చైర్ పర్సన్