రామాయంపేట, నవంబర్ 29 : పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అయ్యప్ప ఆలయానికి వెళ్లి స్వామివారికి మంగళహారతులు, నైవేధ్యాలను సమర్పించారు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఘనంగా అయ్యప్పస్వామి మహా పడిపూజ
రామాయంపేటలో ప్రముఖ వ్యాపారి బల్ల యాదగిరి, మణెమ్మ కుమారుడు నవీన్ తన ఇంట్లో అయ్యప్పస్వామి మహా పడి పూజ నిర్వహించారు. 8వ వార్డులో జరిగిన మహాపడి పూజకు అయ్యప్పస్వాములతోపాటు ప్రజలు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 29 : సుబ్రహ్మణ్య స్వామి జన్మదిన విశేష ఉత్సవాన్ని మెదక్ జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. గురు స్వా ములు హరిదాస్, వైద్య రాజు ఆధ్వర్యంలో స్వామివారి షష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతాభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన చేశారు. స్వామి షష్టి పురస్కరించుకొని 170 మంది దంపతులకు గోత్ర నామాలు నమోదు చేసుకున్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు. వేడుకల్లో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డితోపాటు గురుస్వాములు రమేశ్, రవీందర్, శ్రీనివాస్, రాజమౌళి, శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుగౌడ్, ఆలయ కమిటీ బాధ్యులు శ్రీనివాస్, వీర్‌కుమార్, రాజన్, నాగరాజు, నాగేందర్, అయ్యప్ప స్వాములు పాలొన్నారు.
కొడపాకలో సంగమేశ్వర స్వామి ఉత్సవాలు
పాపన్నపేట, నవంబర్ 29 : మండలంలోని కొడుపాక గ్రామంలో సంగమేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణం, మహారుద్రాభిషేకం, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందిన జంగం వీరేశం దంపతులు శివపార్వతుల విగ్రహాలను ఆలయానికి బహూకరించారు. విగ్రహాలను ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్, ప్రియాంక, జయరాజ్,సౌమ్య దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.