రామాయంపేట, జూలై 31: మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సీఎం ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులు తమ ఇంటి బోనంతో గ్రామంలోని నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
వారి వెంట గ్రామస్తులు, మహిళలు ఆలయానికి చేరుకుని ఇంటి బోనాన్ని అమ్మవారికి సమర్పించి మంగళహారతులు, నైవేద్యాలు సమర్పించారు డీఐజీ కమలాసన్‌రెడ్డి ఆలయానికి వచ్చి ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పోచమ్మ సన్నిధిలో కలశపూజలు నిర్వహించి అన్నదానం చేశారు.