తొగుట, ఆగస్టు 19: సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్లో 10 రోజులుగా కొనసాగిన గోదావరి జలాల ఎత్తిపోతలు సోమవారంతో నిలిచిపోయా యి. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేయడంతో ఆగస్టు 8న రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని విడుదల చేశారు. సోమవారం వరకు 10 రోజులపాటు ఎత్తిపోతల ద్వారా మల్ల న్న సాగర్‌కు 4.25 టీఎంసీలు నీళ్లు పంపింగ్ చేశా రు. అంతకు ముందు మల్లన్న సాగర్‌లో 8.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.
ఎత్తిపోతలతో 4.25 టీఎంసీల నీళ్లు రాగా, మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు 2.70 టీఎంసీల నీటిని తరలించారు. నేడు మల్లన్నసాగర్లో 10.10 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. 2020 నుంచి మల్లన్నసాగర్‌లోకి ఇప్పటి వరకు 45.60 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. యాసంగి సాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నారు. గతంలో మల్లన్నసాగర్లో 15 టీఎంసీల నీటిని నిల్వ చేయ గా, ప్రస్తుతం 10.10 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేశారు. మల్లన్నసాగర్లో 20 టీఎంసీల వరకు నీటిని నిల్వచేస్తే కరువు సమయంలో ఉపయోగపడే అవకాశం ఉందని జిల్లా రైతులు పేర్కొంటున్నారు.