తొగుట, ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించామని డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి ఆరు పంపుల ద్వారా మల్లన్నసాగర్ జలాశయంలోకి నీటిని ఎత్తుపోయడానికి మోటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.
రంగనాయక సాగర్ నుంచి శుక్రవారం ఉదయం తుక్కాపూర్ పంప్‌హౌస్‌లోకి ఎత్తిపోతలను ప్రారంభించామని, ఈ నీటిని తుక్కాపూర్ పంపుహౌస్ నుంచి మల్లన్నసాగర్ జలాశయంలోకి రెండు పంపుల ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది 22 టీఎంసీల వరకు మల్లన్నసాగర్లో నీటిని నిల్వ చేశారు. గత యాసంగి సీజన్లో సాగునీటి అవసరాల కోసం పది టీఎంసీల నీటిని వాడుకున్నారు. ఈ సంవత్సరం మొదటిసారి ప్రాజెక్టులోకి 30 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేస్తామని అధికారులు తెలిపారు.