ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
మొదటి రోజు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంచి, అన్నదానం చేసిన నాయకులు, అభిమానులు
గురుకుల విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ
పలు చోట్ల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు
నేడు రక్తదాన శిబిరాలు
ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ;సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూడు రోజుల పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్‌ప్యాకెట్లు పంచారు. విద్యార్థులకు దుప్పట్లు అందించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నేడు (బుధవారం) రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం సర్వమత ప్రార్థనలతో పాటు మొక్కలు నాటనున్నారు. ఇవే కాకుండా టీఆర్ఎస్కు చెందిన ప్రతీ కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమతమ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజులు జరిగే క్రికెట్ టోర్నమెంట్‌ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మదన్‌రెడ్డి, మహారెడ్డి భూపాల్‌రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను నిజం చేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మెదక్ పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ప్రభుత్వ దవాఖానలో రోగులు, సంధ్యా నిలయంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టి అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ వివిధ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందని మారుమూల పల్లెలు నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలుచేస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారని చెప్పారు. కేసీఆర్ పుట్టిన రోజును మనమంతా పండుగలా చేసుకోవాలన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అన్నదాన కార్యక్రమం..
జిల్లా కేంద్రం మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో మంగళవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా, 3 వేల మంది ప్రజలు, కార్యకర్తలు పాల్గొని అన్నదానం చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు కిశోర్, నర్వ లక్ష్మీనారాయణగౌడ్, వంజరి జయరాజ్, వసంత్‌రాజ్, ఆర్కే శ్రీనివాస్, మెదక్ పట్టణ, మెదక్, హవేళీఘనపూర్ మండలాల పార్టీ అధ్యక్షులు గంగాధర్, శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయిలు, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, మేడి మధుసూదన్‌రావు, దుర్గాప్రసాద్, బొద్దుల కృష్ణ, మధు, మోచి కిషన్, ప్రవీణ్‌గౌడ్, సాయిరాం, గౌస్, మహ్మద్, జయరాంరెడ్డి, సాంబశివరావు, కిష్టయ్య, జాయ్ ముర్రె, సాంసన్ సందీప్, జగదీశ్, ఉమర్, ముజీబ్, కిరణ్, అమీర్, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలి;క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన చింతా ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలోని బాలింతలు, చిన్నపిల్లల వార్డులో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజులు జరిగే క్రికెట్ టోర్నమెంట్‌ను చింతా ప్రభాకర్ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యమాలతో సాధించిన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నానన్నారు.
వేడుకల్లో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కంది ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండల పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, చక్రపాణి, నర్సింలు, శ్రీనివాస్ ముదిరాజ్, మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు రామప్ప, విష్ణువర్దన్, అశ్విన్ కుమార్, శ్రీకాంత్, సోహేల్ అలీ, షేక్ సాబెర్, ఎంపీటీసీ నందకిషోర్, నాయకులు విజయేందర్‌రెడ్డి, ఎంఏ హకీం, చిల్వరి ప్రభాకర్, బొంగుల రవి, బీరయ్య యాదవ్, హరికిషన్, జీవీ శ్రీనివాస్, తాళ్ల నర్సింహగౌడ్, నక్క నాగరాజుగౌడ్, సుదర్శన్ రెడ్డి, సాయి, రషీద్, శ్రావన్‌రెడ్డి, జలేందర్, ప్రవీణ్ కుమార్, నానితో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.