మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 3: సిద్దిపేట జిల్లా మద్దూరులోని బాలికల వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేద బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలనే సదుద్దేశంతో మద్దూరులో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాల, బాలికల హాస్టల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. స మస్యలు పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పాఠశాలలో 230మంది బాలికలు విద్య నభ్యసిస్తున్నారు. వీరికి పాఠశాలలోనే ప్రభుత్వం వసతి సౌకర్యాన్ని కల్పించిం ది. ప్రస్తుతం పాఠశాలలో మురుగు బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో పాఠశాల భవనం లోపల, వెలుపల నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతున్నది. మురుగుతో దోమలు, ఈగలు వ్యాప్తితో బాలికలు అనారోగ్యానికి గురవుతున్నా రు. మురుగు బయటకు పంపించేందుకు అధికారులు చొరవ చూ పడం లేదు. విద్యార్థినులకు రక్షిత మంచినీటిని అందించే వాటర్ ప్లాంట్ పాడై నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేయించడం లేదు. విద్యార్థినుల స్నానానికి వేడినీళ్లు అందించేందుకు గ్లీజర్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయడం లేదు. బా లికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాడైనప్పటికీ మరమ్మతులు చేయించడం లేదు.
బాలికల హాస్టల్లో అరకొర వసతులు ఉన్నాయి. 2018లో చేపట్టిన హాస్టల్ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో అరకొర వసతుల మధ్య విద్యార్థినులు హాస్టల్లో ఉంటున్నారు. ప్రస్తుతం మోడ ల్ స్కూల్, జూనియర్ కళాశాలలకు చెం దిన 80మంది విద్యార్థులు ఉంటున్నారు. 50మంది మాత్రమే ఉండాల్సిన ఈ హాస్టల్లో పరిమితి మించి విద్యార్థినులు ఉం టున్నారు. ప్రస్తుతం హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బాలికల రక్షణ ప్రశ్నార్థ్ధకంగా మారింది. సోలార్ మిషన్ పాడవ్వడంతో విద్యార్థినులకు వేడినీళ్లు అందడం లేదు. గదుల తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరాయి. సమస్యలకు తోడు హాస్టళ్లలో మెనూ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారు లు తక్షణమే స్పందించి సమస్యలన్నీ పరిష్కరించాలని విద్యార్థినులు, తల్లిదండ్రు లు కోరుతున్నారు.