‘గీతం’లో స్నాతకోత్సవ సందడి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శనివారం సందడిగా మారింది. సంతోషకర వాతావరణంలో 15వ పట్టభద్రుల దినోత్స వం (స్నాతకోత్సవం) వైభవంగా నిర్వహించారు.
- ఘనంగా ‘గీతం’ పట్టభద్రుల దినోత్సవం
పటాన్చెరు, జూలై 20: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం శనివారం సందడిగా మారింది. సంతోషకర వాతావరణంలో 15వ పట్టభద్రుల దినోత్స వం (స్నాతకోత్సవం) వైభవంగా నిర్వహించారు. గీతం ఇన్చార్జి ఉపకులపతి ప్రొఫెసర్ వై. గౌతమరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బార్‌లేస్ బ్యాంక్ ఇండియా పూర్వ సీఈవో రామ్‌గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై పట్టాలు, పథకాలను అందజేశారు.
విద్యార్థులు పట్టాలు అందుకుంటున్న సందర్భంగా గీతం ప్రాంగణం సం దడిగా మారింది. ఉల్లాసభరితమైన, ఆహ్లాదకర వాతావరణంలో బార్‌లేస్ బ్యాంక్ సీఈవో రామ్‌గోపాల్ చేతుల మీదుగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పట్టాలు తీసుకున్నారు. ఈ మధుర క్షణాలను చూసి న తల్లిదండ్రులు చప్పట్లతో తమ పిల్లలను ప్రోత్సహించారు.
అనంతరం పట్టాలతో విద్యార్థి బృందాలు చేసిన సందడి అందరినీ ఆకట్టుకున్నది. ప్రయోజకులై తమ పిల్లలు పట్టాలు పొందటంపై తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. విద్యార్థులతో కుటుంబసభ్యులు ఫొటోలు దిగి సంబుర పడ్డారు. తల్లిదండ్రుల దీవెనలతో విద్యార్థుల ముఖా ల్లో సంతోషం కనిపించింది. బం గారు పతకాలు సాధించిన పట్టభద్రులు పలువురు తమకు గీతం వర్సిటీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అధ్యాపకుల ప్రోత్సా హం బాగుందని కొనియాడారు. కార్యక్రమంలో గీతం అధ్యాపక బృందం, సిబ్బం ది, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

