సిద్దిపేట,జూలై 14: కల్లుగీత వృత్తిలో ప్రమాదానికి గురై మృతి చెందిన, శాశ్వత దివ్యాంగు లైన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు.
అనంతరం గీత కార్మికులకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో ఏవో రహమాన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు గురైన అనేక మంది గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా మంజూరైనా ఇప్పటి వరకు బాధితులకు అందలేదన్నారు. కాటమయ్య రక్షణ కవచాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మాత్ర మే గీత కార్మికులకు పంపిణీ చేశారన్నారు.
కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు రవీందర్, చేర్యాల మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింహులు, కనకయ్య,కొమురవెల్లి మండల అధ్యక్షుడు రాజు, మద్దురు మం డల అధ్యక్షుడు లింగం, ధూళిమిట్ట మండల అధ్యక్షుడు సత్తయ్య, చేర్యాల పట్టణ గౌరవ అధ్యక్షుడు బుచ్చిరాములు, కొండపాక మం డల అధ్యక్షుడు శ్రీనివాస్, అకన్నపేట మండల అధ్యక్షుడు మంద శ్రీనివాస్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నవీన్,యూత్ అధ్యక్షుడు ప్రదీప్, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు బాలయ్య, కనకయ్య,లింగం, కృష్ణమూర్తి, శ్రీహరి,గణేశ్, నగేశ్,వెంకటేశ్,సంతోష్,శ్రీనివాస్ పాల్గొన్నారు.