నర్సాపూర్, జూలై 24: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వసతి గృహాలు సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఆవరణంలో పందులు స్వైర్యవిహారం చేస్తున్నాయి. బీఫార్మసీ, పీజీ కళాశాల విద్యార్థుల వసతి గృహం శిథిలావస్థకు చేరుకున్నది.
ఈ రెండు వసతి గృహాల పక్కనే మురుగు ఏరులై పారుతున్నది. వసతి గృహానికి సంబంధించిన బాత్రూమ్ తలుపులు ఊడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంలోని కిటికీలకు, బాత్రూమ్లకు తలుపులు ఊడిపో యి, ఇరిగిపోయి ఉన్నాయి.హాస్టల్ వెనుకాల మురుగు ప్రవహిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈగలు, దోమలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నర్సాపూర్ పట్టణంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహా ల్లో సీసీ కెమెరాలు పనిచేయక విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ ఆశ్రయం పొందుతున్నారు.
సంవత్సరంన్నర నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గతం లో ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చేవారు ఇప్పుడు ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమిస్తామంటున్నారు. 22 ఏండ్ల నుంచి వసతి గృహంలో వాచ్ఉమెన్గా, వం ట మనిషిగా పనిచేస్తున్నా. జీతం చెల్లించాలని సెక్రటేరియట్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి నా ఇప్పటి వరకు చెల్లించలేదు. అధికారులు పెండింగ్ జీతాలు చెల్లించాలి.
– లక్ష్మి, కుక్, బీసీ బాలికల వసతి గృహం, నర్సాపూర్