సిద్దిపేట, అక్టోబర్ 25: సిద్దిపేట మున్సిపాలిటీలో అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ల బృందం ప్రశంసించింది. పర్యటనలో భాగంగా రెండోరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ సువార్త, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్, భైంసా మున్సిపల్ కమిషనర్ రాజేశ్‌కుమార్, ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, చొప్పదండి మున్సిపల్ కమిషనర్ నాగరాజు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె.ప్రసన్న రాణి, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ టి.రాజేశ్వర్‌లు పట్టణంలో పర్యటించారు.
31 వ వార్డులో పర్యటించి తడి,పొడి, హానికర చెత్తను వేరు చేయు విధానాన్ని పరిశీలించారు. వన మహోత్సవంలో పాల్గొని మొకలను నాటారు.
బుస్సాపూర్ లోని రిసోర్స్ పార్ను సందర్శించి తడి చెత్తతో బయోగ్యాస్ తయారీ, బయోమైనింగ్ ఇన్సినరేటర్ నిర్వహణను పరిశీలించారు. స్లాటార్ హౌస్‌ను పరిశీలించి దాని నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. హౌసింగ్ బోర్డులోని చెత్త సేకరణ కేంద్రం సందర్శించి చెత్తను వేరు చేసే విధానాన్ని పరిశీలించారు.
పట్టణంలో కమర్షియల్ వేస్ట్‌ను సేకరించే బాసిల్ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛబడిలో సిద్దిపేట పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల అమలును మున్సిపల్ కమిషనర్లకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ వివరించారు. పర్యటనకు వచ్చిన కమిషనర్లు మాట్లాడుతూ.. సిద్దిపేట ఒక అధ్యయన కేంద్రంగా ఉందని, చాలా అంశాలు నేర్చుకున్నామని, ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రశంసించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కనక రాజు, కౌన్సిలర్ దీప్తి నాగరాజు, డాక్టర్ డీఎన్ స్వామి, సెంటర్ ఇన్స్పెక్టర్ వనిత తదితరులు పాల్గొన్నారు.