కాంగ్రెస్‌ను నమ్మితే అధోగతే
కాంగ్రెస్‌ను నమ్మితే అధోగతి తప్పదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్, మర్కూక్, కుకునూర్‌పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేస్తే జనం మోసపోవడం ఖాయమన్నారు.
- సీఎం కేసీఆర్‌తోనే గజ్వేల్ అభివృద్ధి
- కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేసే బాధ్యత గజ్వేల్ నియోజకవర్గ ప్రజలదే
- నేడు దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ
- అప్పుడు ఎట్లుండే గజ్వేల్ ్రప్రాంతం…ఇప్పుడు ఎట్లయ్యింది
- సీఎం కేసీఆర్ రాకతో మీ గౌరవం పెరిగింది
- ప్రభుత్వం ఏర్పడగానే అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం
- ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- జగదేవ్‌పూర్, మర్కూక్, కుకునూర్‌పల్లి రోడ్‌షోల్లో పాల్గొన్న మంత్రి
- పెద్ద ఎత్తున హాజరైన నాయకులు,కార్యకర్తలు
కాంగ్రెస్‌ను నమ్మితే అధోగతి తప్పదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్, మర్కూక్, కుకునూర్‌పల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటేస్తే జనం మోసపోవడం ఖాయమన్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేసే బాధ్యత గజ్వేల్ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. పదేండ్ల కిందట ఎట్లుండే ఈ ప్రాంతం…ఇప్పుడు ఎట్లయ్యిందో ప్రజలు తేడా గమనించాలని కోరారు. కేసీఆర్ రాకతో మీ గౌరవం, విలువ, ప్రతిష్టలు పెరిగాయన్నారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ పాలనలో నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దన్నారు. 24గంటలు విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా, మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. నాడు గతుకుల గజ్వేల్…నేడు బతుకుల గజ్వేల్గా మారిందన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, రైతుబంధును పెంచుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
– గజ్వేల్/ మర్కూక్/ జగదేవ్‌పూర్/ కొండపాక(కుకునూరుపల్లి), నవంబర్ 17
గజ్వేల్/మర్కూక్, నవంబర్ 17: ‘పదేండ్ల కింద మర్కూక్ ఎట్లుండే.. ఇప్పుడేట్లుంది.. సీఎం కేసీఆర్ రాకతో మీ గౌరవం, విలువ, ప్రతిష్టలు పెరగడంతోపాటు అభివృద్ధి అద్భుతంగా చేసుకున్నాం.. ఇదంతా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మండల అధ్యక్షుడు మెర్సు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రతిఒక్కరూ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలని, సీఎం కేసీఆర్‌తో అభివృద్ధి జరిగిందా లేక గీతారెడ్డి, విజయరామరావు, సంజీవరావు, నర్సారెడ్డితో అభివృద్ధి జరిగిందా ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మర్కూక్‌లో కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మించి, ఇంటింటికీ తాగునీళ్లు ఇచ్చి మంచినీళ్ల గోస తీర్చారన్నారు. గతంలో మోకాలు లోతు గుంతల రోడ్లు కనిపించేవని, 400ఫీట్లు వేసిన చుక్కనీళ్లు రాక రైతులు ఎంతో బాధపడ్డారన్నారు. ఊర్లకు పిల్లను ఇవ్వాలంటే వెనుకడుగు వేసేవాళ్లు.. కానీ, సీఎం కేసీఆర్ పాలనలో భూములు ధరలు పెరిగాయన్నారు. ఇప్పుడు ఎండాకాలంలో చెరువులు, కుంటలు, కాల్వల్లో నీళ్లు పారుతున్నాయన్నారు. ప్రతి రైతు రెండు పంటలు పండించుకునేలా సాగునీరు అందుబాటులోకి తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. నాడు గతుకుల గజ్వేల్.. నేడు బతుకుల గజ్వేల్గా మారిందన్నారు.
తొలి సీఎంను ఇచ్చిన ఘనత మీదే..
తెలంగాణ రాష్ర్టానికి తొలి సీఎంను అందించిన ఘనత మీకే దక్కిందని, దక్షిణ భారతదేశంలో మూడోసారి హ్యాట్రిక్ సీఎంను అందించే ఘనత గజ్వేల్, మర్కూక్ ప్రజలకే దక్కాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మర్కూక్ కొత్త మండలం ఏర్పాటు కాగానే కొత్త పోలీస్ స్టేషన్, ఐవోసీ భవనం, రోడ్ల వేసుకోవడం జరిగిందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, రైతుబంధులను పెంచుతామన్నారు. మహిళల కోసం సౌభాగ్యలక్ష్మి, సన్నబియ్యం పంపిణీ, అసైన్డ్ భూములకు పట్టా భూములుగా హక్కులు కల్పిస్తామన్నారు.
ఎప్పుడు లేనిది ఇప్పుడు వరుసలు కలుపుతుండు..
ఎప్పుడు లేనిది ఎన్నికలు రాగానే వరుసలు కలుపుతు మీ ముందుకొస్తున్న వారిని నమ్మి మోసపోవద్దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓట్ల ముందు వచ్చే నాయకులను నమ్మవద్దని, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉండి అభివృద్ధి చేసి చూపించేవారికే మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు. తెలంగాణలో తప్పిపోయి కాంగ్రెస్, బీజేపీలు వస్తే గజ్వేల్‌లో కేసీఆర్ కట్టించిన భవనాలకు సున్నాలు, వేసిన రోడ్లకు డాంబర్ కూడా వేయారన్నారు. కులం, మతం పేరుతో ప్రజల్లోకి వచ్చే వాళ్లు ఇన్ని రోజులు ఏటు పోయారో ప్రజలకు చెప్పాలన్నారు. ఊర్లలో పెద్దమ్మతల్లి, బీరప్ప, పోచమ్మ పండుగలప్పుడు ఎక్కడిపోయారో ప్రజలకు చెప్పాలన్నారు.
గెలిచేవారికే ఓటు వేయాలి..
తెలంగాణలో అధికారంలోకి వచ్చే కేసీఆర్ ప్రభుత్వానికే మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు. బీజేపీ గెలుస్తాదా… అధికారంలోకి వస్తాదా… పోయినసారి ఒకటే సీటు గెలిచింది. ఈసారి డకౌట్ లేదా ఒకటి, రెండు సీట్లు వస్తాయన్నాని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నెత్తిమీద గంగమ్మలా కేసీఆర్ ఉండగా మనకేమి కాదన్నారు. ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని దీవించాలన్నారు. సిద్దిపేటలో తనకు లక్ష ఓట్ల మెజార్టీని అందించారని, ఇంతటి అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు నాకన్న ఒక ఓటైన ఎక్కువేసి గెలిపించాలన్నారు. కొంతమంది టీవీలు, సోషల్ మీడియాలో ఎందుకు తిడుతున్నారో అర్థం కావాడం లేదన్నారు. బూతులు మాట్లాడుతున్న వారికి పోలింగ్ బూత్‌లో కీయ్.. కీయ్… కీయ్ మంటూ ఓట్లేయాలన్నారు. రైతులకు కటుకేస్తే వచ్చే కరెంట్ కావాల్నా కర్ణాటక తరహలో కరెంట్ కావాల్నో మీరే నిర్ణయించుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి 10హెచ్‌పీ మోటర్తో మూడు గంటల్లో మూడెకరాల పొలం పారుతుందని చెప్పుతుండు రైతుల వద్ద ఆ మోటర్లు ఎక్కడివని ప్రశ్నించారు. బీజేపీ వస్తే బాయికాడ మీటరు…ఇంటి కరెంట్ బిల్లు పంపుతాదన్నారు. వర్ధరాజస్వామి దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మారామచంద్రం, రైతుబంధు సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ భాస్కర్, నాయకులు హరిపంతులు, బాల్‌రెడ్డి, కనకయ్య, సంతోశ్‌రెడ్డి, కృష్ణయాదవ్, లక్ష్మణ్‌యాదవ్, నరేశ్, ఎర్రవల్లి బాల్‌రాజు, భిక్షపతి, కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

