
నర్సాపూర్ : నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఆజాదీ కా మహోత్సవ్ సందర్భంగా ప్రతిజ్ఞ, ఫ్రీడం రన్ నిర్వహించారు. డీఈవో రమేశ్‌కుమార్ జెండాఊపి ఫ్రీడం రన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి జ్యోతి, ఎంఈవో బుచ్చానాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్ శర్మ, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ బి.సుధాకర్‌గౌడ్, ఉపాధ్యాయులు హరికృష్ణ, వినోద్‌రెడ్డి, సీఆర్పీలు నర్సింహాచారి, పూర్ణచందర్ పాల్గొన్నారు.