రామాయంపేట రూరల్, మే 08 : రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్బంగా గురువారం ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఉన్న నిరుపేదలందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా తాము అన్ని పరీక్షలు చేయించామని, అలాగే ఉచితంగా మందులు అందించినట్లు రెడ్ క్రాస్ మెదక్ శాఖ బృందం తెలిపారు.
ఒకప్పుడు జిల్లాలో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి పేదలకు సేవలు అందించే వారమని ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెదక్ శాఖ చైర్మన్ డాక్టర్ లయన్ రాజశేఖర్‌రెడ్డి, కోశాదికారి డీజీ. శ్రీనివాస శర్మ, మేనేజ్మంట్ కమిటీ సభ్యులు దేమె యాదగిరి, దామోదర్‌రావు, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్,సతీష్‌రావు, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.