మెదక్ మున్సిపాలిటీ, జూలై 26: ఈరోజుల్లో ద్విచక్ర వాహనం లేని ఇల్లు లేదు. వాహనం ఉన్నా చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపేవారికి రోడ్డు భద్రతపై అవగాహన సరిగా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా సైతం వర్తించదు. ఈ నేపథ్యంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి 18 ఏండ్ల నుంచి 35 సంవత్సరాల వయస్సులోపు గల వారికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందించడానికి శ్రీకారం చుట్టారు.
11 రోజుల్లో11,250 దరఖాస్తులు
ఈనెల 14 నుంచి 24 వరకు అంటే 11 రోజుల పాటు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేళాలకు మెదక్ నియోజకవర్గంలోని యువతీ, యువకుల నుంచి విశేష స్పందన వచ్చింది. మెదక్ పట్టణం, మండలంతో పాటు నియోజకవర్గంలోని పాపన్నపేట, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, హవేళీఘనపూర్ మండలాల నుంచి పెద్ద సంఖ్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 11 రోజుల్లో11,250 దరఖాస్తులు వచ్చాయని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
రోజుకు 200 మందికి లర్నింగ్
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లకు దరఖాస్తులను ఈనెల 24 వరకు స్వీకరించగా 11,250 మంది ఐప్లె చేసుకున్నారు. వాటిని ఆన్లైన్ చేసి ప్రతీరోజు 200 మందికి స్లాట్ బుక్ చేసి ముందుగా లెర్నింగ్ లైసెన్స్‌లు ఇస్తామని, నెల రోజుల తర్వాత మళ్లీ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసిన వారికి ఒరిజినల్ లైసెన్స్ అందించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల య ప్రతినిధి శ్రీశైలం తెలిపారు.టూ, ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌కు సుమారు రూ.3 వేల వరకు ఖర్చు అవుతుండగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉచితంగా లైసెన్స్‌లు అందిండంపై యువత హర్షం వ్యక్తం చేస్తోంది.
ఎమ్మెల్యేది మంచి ఆలోచన
మాకు స్కూటీ ఉంది.. డ్రైవిం గ్ చేస్తాను కానీ లైసెన్స్ లేదు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత లైసెన్స్ మేళా ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నాను. ఇంత మంచి మేళా నిర్వహించిన పద్మాదేవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– శిరీష, మెదక్
లైసెన్స్ ఇప్పించడం అభినందనీయం
ఒకసారి నేను, మా ఫ్రెండ్ బైక్ పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లైసెన్స్ లేకపోవడంతో ఫై న్ వేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలా ఎంతోమంది లైసెన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది డబ్బులు లేక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేకపోతున్నా రు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉచితంగా డ్రైవింగ్ లైసె న్స్ ఇప్పించడం అభినందనీయం.
– వినయ్, పొడ్చన్‌పల్లి