మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ప్రయాణం కావడంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సులో సీట్లు దొరుకుతాయో, దొరకవు అనే ఆత్రుతతో బస్టాండ్‌ల్లో బస్సు రాగానే ఎకేందుకు ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. బస్సుల్లో రద్దీతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్‌బోర్డు మీద ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తున్నది.
బస్సుకు వేళాడుతూ విద్యార్థులు చదువుకోవడానికి సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. బస్సుల కోసం ఎదురుచూసి చూసి వచ్చిన బస్సులో సీట్లు దొరకకపోయినా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. చిన్నపిల్లలతో ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే పెద్ద సాహసమే చేయాలి అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.
-నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సిద్దిపేట, ఫిబ్రవరి 14