రెండోరోజు నాలుగు నామినేషన్లు
మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండోరోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి మెదక్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
- మెదక్ జిల్లా రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్
మెదక్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంట్ స్థానానికి రెండోరోజు శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ స్థానానికి మెదక్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. శుక్రవారం ప్రజా వెలుగు పార్టీ నుంచి సారా యాదగిరిగౌడ్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బొమ్మల విజయ్ కుమార్, తుమ్మలపల్లి పృథ్వీరాజ్ నామినేషన్లు వేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గొల్లపల్లి సాయిగౌడ్ నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ తెలిపారు.
మూడంచెల భద్రత
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మెదక్ కలెక్టరేట్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నామినేషన్ పత్రాల దాఖలులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా నామినేషన్ల దాఖలు జరిగేలా నిఘా ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి.బాలస్వామి పర్యవేక్షణలో నిత్యం నామినేషన్ల స్వీకరణలో డీఎస్పీ డాక్టర్ రాజేశ్తో పాటు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

