హుస్నాబాద్, సెప్టెంబర్ 12: సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి ఇండ్లపై కాంగ్రెస్ మూకలు దాడులకు పాల్పడుతున్నాయని హుస్నాబాద్ మాజీఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ రౌడీమూకలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
గురువారం హుస్నాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని హౌస్అరెస్టు చేసి కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీతోపాటు కాంగ్రెస్ మూకలను బయట వదిలేసి దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్న సీఎం రేవంత్ మిగతా ఎమ్మెల్యేలు చేరేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇటువంటి దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడరి విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి వల్ల రాబోమే రోజుల్లో రాష్ట్రం రణరంగంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై, తెలంగాణ భవన్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతోపాటు అతడి అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.