మెదక్ రూరల్, జూలై 21 : హావేలి ఘనపూర్ మండలంలోని స్కూల్ తండాలో మూడవత్ బాన్సీ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం బీఆర్ఎస్ మండల నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె బాన్సీ కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని స్కూల్ తాండ మాజీ సర్పంచ్ యశోద రంజా, మాజీ ఎంపీటీసీ మంగ్య నాయక్ సోమవారం బాన్సీ కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరితో పాటు ఔరంగాబాద్ తండా మాజీ సర్పంచ్ లడికి పూల్ సింగ్, గ్రామ అధ్యక్షుడు పాండు, నాయకులు బాధ్య నాయక్, గొప్య నాయక్, రంజిత్ ఉన్నారు.